|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 08:31 AM
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామానికి చెందిన విద్యార్థిని జి. సాయిశృతి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు మంగళవారం జిల్లా కబడ్డి అసోసియేషన్ కార్యదర్శి ఎం. రాము తెలిపారు. నిజమాబాద్ పట్టణంలో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి బాలికల సీనియర్స్ విభాగం కబడ్డీ పోటీలలో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు. గ్రామానికి చెందిన కబడ్డీ అసోసియేషన్ సభ్యులు సాయిశృతి ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేశారు.