by Suryaa Desk | Tue, Nov 05, 2024, 02:22 PM
ఉచిత బస్సు సర్వీసు (Free Bus Service)తో తాము దారుణంగా నష్టపోయామంటూ ఆటో డ్రైవర్లు (Auto Drivers) చేస్తున్న నిరసనలకు మద్దతు తెలిపేందుకు ఇందిరాపార్క్ (Indira Park) చేరుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ (BRS Working President KTR).ధర్నా స్థలానికి స్వయంగా ఆటోలో చేరుకున్న కేటీఆర్.. ఆటో డ్రైవర్లకు మద్దతు ధర్నాకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు 2లక్షల మంది ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారని, గతంలో ఆటో నడిపితే రోజుకు రూ.1000 రూపాయలు వచ్చేవని, కానీ ఇప్పుడు మహాలక్ష్మీ స్కీమ్ ఉచిత బస్సు స్కీమ్ ప్రభావం వల్ల రూ.500 కూడా రావడం లేదని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.12వేలు ఇస్తామన్నారని, ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే ఈ రోజు (మంగళవారం) ఉదయం నుంచే ఆటో కార్మికుల మహాధర్నా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆటో కార్మికుల మహా ధర్నాకి ఆటోలోనే ప్రయాణించి చేరుకున్నారు కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు.