by Suryaa Desk | Sun, Nov 03, 2024, 08:46 PM
యాదవుల సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఆదివారం పటాన్చెరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మెట్టు రాజు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతు సదర్ ఉత్సవాలు యాదవుల ఐక్యతను జంతువుల పట్ల వారికున్న ప్రేమను వారి జీవన విధానాన్ని చాటుతాయని తెలిపారు. పాడి పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్న యాదవ సోదరులు పశువుల సంతతి పెరగడానికి దున్నపోతులను పవిత్రంగా చూడడం ఈ సదర్ సమ్మేళన ప్రత్యేకత అన్నారు.యాదవుల సాంస్కృతికి ప్రతీకఐన సదర్ వేడుకలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారిక పండగగా ప్రకటించారని గుర్తు చేశారు. సదర్ ఉత్సవాల సందర్భంగ ఏర్పాటుచేసిన పులి రాజు నృత్యాలు, దున్నపోతుల విన్యాసాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, జలిగిరి దేవరాజ్, మెట్టు కృష్ణ యాదవ్, తలారి మధు,రవి,శ్రీనివాస్,వెంకటేశ్, యాదవ సోదరులు, తదితరులు పాల్గొన్నారు.