![]() |
![]() |
by Suryaa Desk | Mon, Dec 23, 2024, 02:15 PM
సిద్దిపేట జిల్లా ఐడిఓసీకి సోమవారం ఉదయం 10: 57 ని. లకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు జిల్లా కలెక్టర్ మనుచౌదరి, ఇన్ ఛార్జ్ సీపీ అకిల్ మహాజన్ లు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. మొదటగ పోలీసు గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్, అనంతరం ఐడీఓసీ మొదటి అంతస్తులోని స్టేట్ ఛాంబర్ లో తేనేటి విందును స్వీకరించి కలెక్టర్, సీపీ లతో ముచ్చటించారు.