by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:31 PM
మల్లన్న సాగర్ లో పుష్కలంగా నీళ్ళున్నా, రైతులకు నీళ్లు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యం చెందిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విమర్శించారు..రాయపోల్ మండలంలోని తిమ్మక్క పల్లి లో ఆయన విలేఖరులతో మాట్లాడారు.
కెసిఆర్ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మొదలు కొని మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల వరకు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు.. దుబ్బాక నియోజకవర్గంలోని మల్లన్న సాగర్ జల బాండాగారంగా ఉందన్నారు.. ఎమ్మెల్యే గా గెలువగానే ఏడాది క్రితం నుండి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ల నుండి ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేలా పిల్ల కాలువలు పూర్తి చేయాలని ప్రభుత్వం ను కోరడం జరిగిందన్నారు.. ఎన్ని మార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.. దుబ్బాక నియోజకవర్గం లో కాలువల నిర్మాణం పక్కన పెట్టి హైదరాబాద్ కు నీళ్లు తీసుకోవడానికి పనులు చేపడుతున్నారని, వీరికి రైతుల మీద ఏ పాటి ప్రేమ ఉందొ అర్థమవుతుందన్నారు..ఈ ఏడు వర్షాభావ పరిస్థితి ఏర్పడటం తో యాసంగి సాగు ప్రశ్నర్ధకంగా మారిందన్నారు.. యాసంగి కి కాలువలు నిర్మించి సాగునీళ్లు విడుదల చేయకపోతే పంట పొలాలు ఎండి పోవడం ఖాయమన్నారు.. ఒక్క గుంట పొలం ఎండినా అది ప్రభుత్వ వైపుల్యం అవుతుందని, ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.
దుబ్బాక నియోజకవర్గం లో గతంలో నిర్మించిన కాలువలు పిచ్చి గడ్డి, మొక్కలతో, పూడికతో నిండిపోయిందని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.. దుబ్బాక నియోజకవర్గం లో కాలువలు పూర్తి చేసి చెరువు, కుంటలకు, పంట పొలాలకు సాగునీరు విడుదల చేయలేని పక్షం లో హైదరాబాద్ కు మల్లన్న సాగర్ నుండి తరలించే నీటిని వేలాది మంది రైతులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు.. ఇప్పటికే రుణమాఫీ 50% మాత్రమే అయిందని, 100% మాఫీ చేయాలని ఆయన కోరారు.. రైతు భరోసా సైతం వానాకాలం, యాసంగి రెండు పంటలయి విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. రాజకీయాలు పక్కన పెట్టి, రైతుల హితమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు..కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు భోంపల్లి మనోహర రావు, రాయపోల్, తొగుట మండలాల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, జీడిపల్లి రాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ లింగాయపల్లి యాదగిరి, నాయకులు హన్మాండ్ల కాడి రాజిరెడ్డి, కర్ణంపల్లి రాజిరెడ్డి, ఇప్ప దయాకర్, రామచంద్రం గౌడ్ తదితరులు ఉన్నారు.