|
|
by Suryaa Desk | Mon, Dec 23, 2024, 04:25 PM
వికారాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి జిల్లా ఏ న్ ఎమ్ లా బృందం సిఐటియు నాయకులు మెమొరాండం ఇవ్వడం జరిగింది. మీ న్యాయమైన సమస్యల పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిస్తానని స్పీకర్ అన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్ ఆదివారం వికారాబాద్ కు స్పీకర్ వచ్చిన సందర్బంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మెమొరాండం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నిర్వహించే ఎగ్జామ్స్ రద్దు చేయాలని , విధులు నిర్వహిస్తున్న ఏ న్ ఎమ్ లను అందరిని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రమోషన్స్ ఇవ్వాలని, ఈ కాంగ్రెస్ గతంలో సిఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అసెంబ్లీలో చర్చించి జి ఓ ఇవ్వాలి.ప్రభుత్వం నిర్వహించే ఏఎన్ఎంల ఎగ్జామ్ ను వెంటనే రద్దు చేయాలని అందరిని ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని సిఐటియు యూనియన్ గా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.
మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు లీలావతి మాట్లాడుతూ సిఎం గారు గతంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని లేనిచో రేవంత్ రెడ్డి ఇల్లు అసెంబ్లీ ముట్టడిస్తామని మహిళలు ఆగ్రాహం వ్యక్తం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.మా ఏ న్ ఎమ్ లా సమస్యలు పరిష్కరించనిచో ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు ముట్టడిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు వెంకటమ్మ భారతి సువాసిని మంజుల స్రవంతి రజియా పద్మ సల్మా సుజాత జెసిల స్వరూప చంద్రకళ రాములమ్మ తిరుపతమ్మ అనిత యాదమ్మ మల్లమ్మ హంస రోజా భారతి పాల్గొన్నారు.