by Suryaa Desk | Mon, Dec 23, 2024, 04:28 PM
చేవెళ్ల మండల పరిధిలోని ఆలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005 - 06 లో పదో తరగతి చదివిన విద్యార్థులు గ్రామ పరిధిలోని ఓ ఫామ్ హౌస్ లో ఆదివారం ఒకే వేదికపై చేరుకుని సందడిగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత కలుసుకున్న చిన్ననాటి స్నేహితులు నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సందడిగా గడిపారు.
అనంతరం నాటి గురువులను ఘనంగా సన్మానించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. కార్యక్రమంలో నాటి ప్రధానోపాధ్యాయులు నర్సింహారావు, ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రెడ్డి, రత్నమాల, కృష్ణగౌడ, మల్లేష్, మోహన్ రావు సయ్యద్ సలీం, పీఈటీ కిష్టయ్య, పూర్వ విద్యార్థులు ప్రవీణ్ కుమార్, మల్లేష్, హరి, నందు, ప్రవీణ్, నవీన్ గౌడ్, మహేందర్, రాధా, సౌజన్య, రాధిక, తదితరులు పాల్గొన్నారు.