|
|
by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:55 PM
ఖమ్మం పట్టణంలో ఆదివారం నాడు మయూరి సెంటర్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఖమ్మం జిల్లా నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి , టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు , టి ఎస్ ఎస్ చైర్మన్ శ్రీమతి వెన్నెలక్క ల ఫ్లెక్సీ ఫోటోలకు పాలాభిషేకం చేశారు . ఈ సందర్భంగా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల అధ్యక్షులు పాతకోటి నరసింహారావు మాట్లాడుతూ శనివారం రోజున జరిగిన శాసన సభ మండలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నిరుద్యోగ కళాకారుల గురించి ప్రస్తావించడం జరిగిందని.
గత ప్రభుత్వం ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు అన్యాయం చేశారని మండిపడ్డారు . శాసన మండల లో ప్రసావిస్తూ కళాకారులు అందరూ ప్రజా ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి చట్టసభలో విన్నవించడం జరిగిందని అందుకు గాను పాలాభిషేకం చేయడం జరిగిందని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో కర్ష పుల్లయ్య , బొడ్డు నాగేశ్వర్ రావు , గుడిపల్లి పుల్లారావు, పాల్గొన్నారు .