by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:57 PM
ఉత్తమమైన విద్యతో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సీఐ నిరంజన్ రెడ్డి అన్నారు. మెట్ పల్లి పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆదివారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో గురుకుల పాఠశాలల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు.
చిలిపి పనులతో కాలయాపన చేయకుండా శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం సిఐని విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సమావేశంలో ఆర్ఎల్ సి డాక్టర్ రాజేందర్ దాసరి, ప్రిన్సిపల్ తిరుపతి, హరీష్, రాకేష్, సయ్యద్ సమీనా, అశోక్ తదితరులు పాల్గొన్నారు.