by Suryaa Desk | Mon, Dec 23, 2024, 04:06 PM
వరంగల్ లో కొనుగోలు చేసి ఆటోలో పెద్దాపురం తరలిస్తున్న ఎండు గంజాయిని అక్కంపేట తోరణం వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం ఆత్మకూరు సిఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఆత్మకూరు మండలం అక్కంపేట సమ్మక్క సారలమ్మ తోరణం వద్ద పోలీసులు పెట్రోలింగ్ లో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వరంగల్ నుంచి పెద్దాపురం కు ఆటోలో గంజాయి తీసుకొని వస్తున్న ఆటో డ్రైవర్ వంశీకృష్ణ పోలీసులను చూసి వెనుకకు తిరిగి పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు.
ఆటోను తనిఖీలు చేయగా అందులో ఒక బ్యాగులో 1100 గ్రాముల ఎండు గంజాయి దాని విలువ 27,500 పోలీసులు స్వాధీనం చేసుకొని ఆటో డ్రైవర్ వంశీకృష్ణ విచారించగా వరంగల్లో మహమ్మద్ అనీఫ్ అనే యువకుని దగ్గర కొనుగోలు చేసి పెద్దాపురం కు తరలిస్తున్నట్లు వంశీకృష్ణ పోలీసులు తెలిపారు. పెద్దాపూర్ గ్రామానికి చెందిన ఒరే వంశీకృష్ణ గత ప్రతి నెల నుండి వరంగల్ లో గంజాయి కొనుగోలు చేసి పెద్దాపురంలో అధిక ధరలకు అమ్ముకుంటున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని ఆటోను సీస్ దర్యాప్తు చేస్తున్నట్టు. సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. గంజాయి సీజ్ చేసే ముందు అక్కంపేట పంచాయతీ కార్యదర్శి సంపూర్ణ, ఎస్సై అశోక్, గ్రామస్తుల సమక్షంలో సీజ్ చేశారు. గంజాయిని పట్టుకున్న పోలీసులను సిఐ సంతోష్ కుమార్ అభినందించారు