|
|
by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:50 PM
ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహర్షి విద్య సంస్థ అధినేత జలజ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలోఅయ్యప్ప స్వామి. ప్రత్యేక పూజలు శాంతి స్వరూపుడు శ్రీ శ్రీ శ్రీ రాజు గురు స్వామి నేతృత్వంలో అయ్యప్ప స్వామికి పుష్పాభిషేకం పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు మండలంలోఅయ్యప్ప స్వామిలు పూజలో పాల్గొని స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణ చేస్తూతో ప్రాంతమంతా మారుమొగాయి.
ఈ కార్యక్రమానికి మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి అనంతరం స్వాములకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా రాజు గురు స్వామి మాట్లాడుతూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని అయ్యప్ప స్వామి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధార స్వాములు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు .