by Suryaa Desk | Mon, Dec 23, 2024, 02:28 PM
జనగాం జిల్లాలోని బాల యేసు విద్యార్థులు నిరుపేదలకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. గత కొద్ది రోజులుగా పాఠశాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు సొంతంగా సేకరించిన నిధులతో క్రీస్తు జన్మదినం సందర్భంగా జనగాం జిల్లా దేవరుప్పుల మండలంలోని పలు గ్రామాలలో పర్యటించి నిరుపేద కుటుంబాలకు ఈ క్రిస్మస్ కానుకలను అందజేశారు.ఈ కానుకలలో బియ్యము, ఉప్పు, పప్పులు, దుప్పట్లు, చెద్దర్లు సుమారుగా మూడు లక్షల 20వేల రూపాయలతో తాము సేకరించిన డబ్బులతో కొనుగోలు చేసి అందజేశారు. పాఠశాల కరస్పాండెంట్ బ్రదర్ జేసురాజు చిన్నారులను అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను చదువుతోపాటు విద్యార్థులు అలవర్చుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.