by Suryaa Desk | Mon, Dec 23, 2024, 02:38 PM
జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ ఎస్పీ రూపేష్ తెలిపారు. సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిందితుడు భీమేష్ వద్ద 18లక్షల విలువైన 24తులాల బంగారం, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. దొంగతనాలను అరికట్టాడానికి తమ కాలనీలలో సీసీ కెమెరాలను అమర్చుకోవాలని సూచించారు. అదనపు ఎస్పీ సంజీవరెడ్డి పాల్గొన్నారు.