|
|
by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:23 PM
పట్టణం లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఆదివారం గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ 136 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మానవ మనుగడకు ఆయన చేసిన సేవలు అమోఘమని ఉప ప్రధానోపాధ్యాయుడు అన్నారు. ఏకలవ్య పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా రామానుజన్ జయంతిని పురస్కరంచుకుని విద్యార్థులు స్వయంగా గణిత శాస్త్ర ప్రాజెక్టులు తయారుచేసి ప్రదర్శించారు. ఉత్తమంగా తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా మ్యాస్ టీచర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శ్రీనివాస రామానుజన్ ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే గణిత శాస్త్రం పై ఆసక్తి పెంచుకోవాలని ప్రపంచం గర్వించ దగ్గ మహా మేధావి శ్రీనివాస రామానుజన్ అని మానవ మనుగడ గణిత శాస్త్రంపై ఆధారపడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.