|
|
by Suryaa Desk | Mon, Dec 23, 2024, 03:15 PM
పెద్దపల్లి పట్టణంలో స్థానిక జెండా చౌరస్తా వద్ద పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణ వేణి సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి గడ్డం వెంకటస్వామి 10,వ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు వారి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు సురేష్ గౌడ్ మాట్లాడుతూ వెంకట స్వామి 8 సార్లు ఎంపీగా గెలిచి అలాగే కేంద్ర మంత్రిగా పనిచేస్తూ పేద బడుగు బలహీన వర్గాల కొరకై పార్లమెంటు పరిధిలోఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం ద్వారా అందించారు అలాగే మారుమూల ప్రాంతాలకు రోడ్డుల సౌకర్యం కల్పించారు ముఖ్యంగా దేశంలోనే కార్మికులకు పెన్షన్ విధానాన్ని కల్పించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.
అలాగే సింగరేణి కార్మికులు రిటైర్డ్అయిన తర్వాత వారికి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా సింగరేణి సంస్థ ద్వారా పోరాటాలు చేసి వారికి కూడా పెన్షన్ ఇప్పించిన ఘనత ఆయనకే దక్కింది నిత్యం పేద ప్రజల కోసం తపించి పోయావారని ముఖ్యంగా విశాఖ ట్రస్టును స్థాపించి పార్లమెంట్ పరిధిలోప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు కూర్చినందుకై బెంచ్ లను సమకూర్చారు అలాగే ఎన్నో గ్రామాలకు త్రాగు నీటి కొరకై ప్రజలు ఇబ్బందు లను గ్రహించి బోర్లు వేయించి వారి తాగునీటి సమస్యను తీర్చారు అలాగే ఇప్పుడు వారి తనయులు ఎమ్మెల్యేలుగా వారి మనుమడు ఎంపీగా ఉంటూ వెంకటస్వామి గారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ పేద ప్రజలకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని వారన్నారు అలాగే మనం కూడా కాక వెంకట స్వామి ఆశలను ముందుకు పోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుచున్నాము.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భూతగడ్డ సంపత్ ,పుష్పకళా శ్రీమాన్, పట్టణ ప్రధాన కార్యదర్శి దొడ్డుపల్లి జగదీష్, ఉపాధ్యక్షులు నాంసాని శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు బండారి సునీల్ గౌడ్ ,మైనార్టీ నాయకులు సజ్జాద్,మసూద్, కాజా ,నదీమ్, కాంగ్రెస్ నాయకులు బుర్ర తిరుపతి గౌడ్ ,కొలిపాక సంపత్ ,గంగుల సంతోష్, బాలసాని సతీష్, విజయేందర్ రెడ్డి, సంపత్, కళ్యాణ్,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.