by Suryaa Desk | Sun, Dec 22, 2024, 07:13 PM
దేవరకద్ర నియోజకవర్గం గూరకొండలో ఆదివారం బీజేపీ జిల్లా కార్యదర్శి, సభ్యత్వ సహా ఇన్‌ఛార్జ్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ 136, 137 నూతన బూత్ కమిటీ అధ్యక్షులుగా గడుగు చెన్నప్ప, కనేమోని వెంకటేష్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వారు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కృష్ణంరాజు, ఉపాధ్యక్షులు గోవిందు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.