by Suryaa Desk | Sun, Nov 03, 2024, 09:34 PM
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కొత్త ఛైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడు.. ఇటీవల చేసిన కామెంట్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తిరుమలలో పని చేసే సిబ్బంది అందరూ హిందువులే ఉండాలని బీఆర్ఎస్ నాయుడు ఇటీవల ప్రకటించారు. దీనిపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. తిరుమలలో పూర్తిగా హిందువులే పనిచేయాలనడం సరైన నిర్ణయమేనని రాజాసింగ్ తమ మద్దతు ప్రకటించారు. టీటీడీ కొత్త ఛైర్మన్ బీఆర్ నాయుడు మంచి నిర్ణయం తీసుకున్నారని రాజాసింగ్ అభినందించారు.
ఇదే క్రమంలో ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీకి ఘాటు కౌంటర్ ఇచ్చారు. అయితే.. టీటీడీలో, కాశీ బోర్డులో హిందూయేతరులకు స్థానం లేనప్పుడు వక్ఫ్ బోర్డులో మాత్రం ఇతరుల ప్రమేయం ఎందుకంటూ అసదుద్దీన్ ఇటీవల ప్రశ్నించారు. టీటీడీలో అన్యమస్తులు ఉండొద్దని చెప్తున్నారని... అలాంటప్పుడు వక్ఫ్ బోర్డులో కూడా నాన్ ముస్లింలను ఎలా నియమిస్తారంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు. ముస్లిమేతరులను చేర్చాలనే ఉద్దేశంతోనే మోడీ సర్కార్ వక్ఫ్ బోర్డు సవరణలు తీసుకొచ్చిందని ఆరోపించారు.
కాగా.. అసదుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాజాసింగ్ స్పందించారు. వక్ఫ్‌బోర్డ్‌తో టీటీడీని పోల్చడం ఎంతమాత్రం సరికాదన్నారు. 1947లో అసలు వక్ఫ్‌బోర్డ్‌కు ఎన్ని భూములు ఉన్నాయని రాజాసింగ్ ప్రశ్నించారు. హిందూ రైతుల నుంచి ముస్లింలు పెద్ద ఎత్తున భూములను కబ్జా చేశారని ఆరోపించారు. వక్ఫ్ భూములపై తర్వలో మంచి చట్టం రాబోతోందంటూ అసదుద్దీన్‌కు కౌంటర్ వేశారు.
అయితే.. కొత్తగా నియమితులైన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు.. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీలో కేవలం హిందువులే పని చేయాలని బీఆర్ నాయుడు ప్రకటించారు. కాగా.. ఇప్పటికే టీటీడీలో ఉన్న ఇతర మతాలకు చెందిన సిబ్బందిని వేరే ప్రభుత్వ శాఖలకు పంపాలా..? వీఆర్‌ఎస్ ఇవ్వాలా అనే విషయాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పుకొచ్చారు. తిరుమలలో పనిచేసే ప్రతి ఒక్కరూ హిందువులై ఉండాలని.. అదే తన మొదటి ప్రయత్నం అవుతుందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇందులో చాలా సమస్యలు ఉన్నాయని.. వాటిన్నింటినీ పరిశీలించాలని బీఆర్ నాయుడు తెలిపారు.
వెంకటేశ్వర స్వామి భక్తుడైన తనను టీటీడీ బోర్డు ఛైర్మన్‌గా నియమించడం ఒక విశేషంగా భావిస్తున్నట్లు బీఆర్ నాయుడు తెలిపారు. తనకు బోర్డు సారథ్య బాధ్యతలు అప్పగించినందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వంలోని ఇతర నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.