by Suryaa Desk | Sun, Dec 22, 2024, 06:00 PM
ఈ ఏడాది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.297 కోట్లు సైబర్ నేరగాళ్లు దోచుకున్నారని కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్ కమిషనరేట్ వార్షిక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'డిజిటల్ అరెస్టు అనగానే భయపడి చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కరెంట్ ఖాతాల ద్వారా సైబర్ నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఎటువంటి విచారణ లేకుండానే కరెంట్ ఖాతాలు ఇష్యూ చేస్తూ కొందరు బ్యాంక్ సిబ్బంది సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారు.' అని అన్నారు.