by Suryaa Desk | Wed, Jan 08, 2025, 10:50 AM
బార్ అండ్ రెస్టారెంట్ పై అర్థరాత్రి ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇటీవల కాలంలో నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న బార్ అండ్ రెస్టారెంట్లలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.బార్ అండ్ రెస్టారెంట్ల మాటున పబ్ కల్చర్ ను నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో మూసాపేట లో ఓ ప్రముఖ బార్ రెస్టారెంట్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. కస్టమర్స్ ను ఆకర్షించేందుకు నిబంధనలకు విరుద్దంగా మహిళలతో నృత్యాలు చేయిస్తున్నారని ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో బార్ అండ్ రెస్టారెంట్ లో డాన్సులు చేస్తున్న 11 మంది మహిళలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇది గమణించిన బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహకులు అక్కడి నుంచి ఉడాయించారు. దీనిపై పోలీసులు కేసు చేసుకొని దర్యాప్తు చేపడతామని వెల్లడించారు.