by Suryaa Desk | Mon, Jan 06, 2025, 02:59 PM
TG: హనుమకొండలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర మంత్రులు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొన్నారు. హనుమకొండ-హైదరాబాద్ మార్గంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాలుష్య రహితంతోపాటు ఇంధన భారం తగ్గించుకునేందుకు ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కాయి.అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని… ఇప్పటి వరకు 125 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు.. మహిళలు 4350 కోట్ల రూపాయల విలువైన ప్రయాణం ఉచితంగా చేశారన్నారు. అక్యుపేన్సి గతంలో కంటే రెట్టింపు అయింది.. ఆర్టీసీ ఉద్యోగుల వల్లే సాధ్యం అవుతుంది వారు నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు. తెలంగాణ కోసం కోట్లడిన ఆర్టీసీ ఉద్యోగులు బస్ కా పెయ్య నై చెలిగ అనే ఉద్యమాన్ని చేపట్టారన్నారు. వారికి 2013 బాండ్స్ ఇచ్చాం.. 21 శాతం పీఆర్సీ ఇచ్చామని… ఆర్టీసీ లో కారుణ్య నియామకాలు చేపట్టామని గుర్తు చేశారు.3 వేల ఉద్యోగాలకు నియామకాలు చేపడుతున్నామన్నారు. వెయ్యి బస్సులు ఎలక్ట్రిక్ రాష్ట్రంలో ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. ఇప్పటికే హైదరాబాద్ , కరీంనగర్ , నిజామాబాద్ లో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించుకున్నామన్నారు. ఈరోజు వరంగల్ లో మొదటి దశగా 50 బస్సులు ప్రారంభం చేసుకుంటున్నామని.. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తున్నామని భరోసా కల్పించారు. ఆర్టీసీ స్వతహాగా మరో 1000 బస్సులు కొనుగోలు చేస్తుందన్నారు.