by Suryaa Desk | Mon, Jan 06, 2025, 02:22 PM
వరంగల్ జిల్లా నల్లబెల్లి బిఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం వారిని వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ కక్కెళ్ళ శ్రీనివాస్ గౌడ్. మండల ప్రధాన కార్యదర్శి కొత్త పెళ్లి కోటిలింగాచారి. క్లస్టర్ ఇంచార్జి గందె శ్రీనివాస్ గుప్తా డిమాండ్ చేశారు. ఆదివారం మండల పార్టీ కార్యాలయంలో పత్రికా విలాఖరుల సమావేశంలో మాట్లాడుతూ నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ని నల్లబెల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బానోత్ సారంగపాణి ని బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను వెంటనే విడుదల చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ ప్రజల సాక్షిగా రాహుల్ గాంధీ తో. రైతు భరోసాను 15వేల రూపాయలు చేసి ఇస్తామని హామీ ఇచ్చిందో దానిని ఇప్పుడు 15 వేల నుండి 12 వేలకు తగ్గించి ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రజలను, రైతాంగాన్ని మోసం చేస్తుంది.
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి నల్లబెల్లి మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ బానోత్ సారంగపాణి జిల్లా ముఖ్య నాయకులు కలిసి వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి రైతు భరోసాను15 వేల నుండి 12 వేలకు తగ్గించడం సమంజసం కాదు అని సామరస్య పూర్వకంగా వినతి పత్రం అందిస్తామని కోరగా వరంగల్ సీపీ అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. దీనినీ బిఆర్ఎస్ మండల పార్టీ తరఫున తీర్వగా ఖండిస్తున్నాం.
ఇప్పటికే రెండు టర్ముల రైతుబంధును ఎగగొట్టి ఆ రెండు సార్లు రైతుల ఖాతాలో రైతుబంధుగా వేయవలసిన డబ్బులను రుణమాఫీ పేరు తోటి కొంతమంది రైతులకే రుణమాఫీ చేసి ఇంకా చాలామంది రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆరు గ్యారెంటీ ల పేరుతో. మార్పు అంటూ ప్రజల్లోకి వచ్చి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చడం తమ వల్ల కాదని తెలిసి ప్రజలను రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని నల్లబెల్లి బి.ఆర్.ఎస్. పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఈ పత్రిక సమావేశం లో , నానే బోయిన రాజ రామ్ యాదవ్. క్యాతమ్ శ్రీను వాస్ ,గుమ్మడి వేణు , గోనెల నరహరి , నాగెల్లి శ్రీనివాస్ , వేల్పుల రవి ,పాండవుల రాంబాబు ,md నన్నే సాహెబ్ , పెండ్యాల మహేందర్ ,బూస సదయ్య , మాటూరి హరిష్ , దూర్గని రాజు మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.