by Suryaa Desk | Mon, Jan 06, 2025, 03:07 PM
దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉస్మానియా యూనివర్సిటీ మ్యాథ్స్ ప్రొఫెసర్ మార్పడగా చేన్న కృష్ణారెడ్డి ఉమ్మడి మెదక్, కరీంనగర్,నిజామాబాదు,ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో నిలుస్తున్న సందర్బంగా తెలంగాణ యువశక్తి ఆధ్వర్యంలో స్వగ్రామమైన రామక్కపేటలోని మున్నూరు కాపు సంఘంలో గ్రామంలోని కుల పెద్దలు, యువజన సంఘాలు, పట్టభద్రులతో కలిసి ఆశీర్వాద సభను ఏర్పాటు చేశారు. పుట్టిన ఊరు మన పుట్టిన నెల రామక్కపేట కాబట్టి రామక్కపేట అంటే గ్రామం ఎంతో అభిమానం ఉన్నది.
మొదటగా మన గ్రామంలోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉంటున్నా మీ ద్వారా ప్రచారం చేసి ఆశీర్వాదముతో తప్పకుండా గెలుస్తున్న ఇదే మన గ్రామంలో విజయోత్సవ సభను నిర్వహించుకుందామని దీమా వ్యక్తం చేశారు. నేను ప్రశ్నించే వ్యక్తిగా కాదు సమస్యలకు స్పందించే వ్యక్తిగా ఉంటానని అన్నారు. ప్రభుత్వ పాలనపరంగా సంక్షేమ అభివృద్ధి పరంగా మీకు తోడుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు,తెలంగాణ యువశక్తి టీం సభ్యులు, రామకపేట గ్రామ పెద్దలు యువకులు,వివిధ కుల సంఘాల నాయకులు వివిధ యువజన సంఘాలు,తదితరులు పాల్గొన్నారు.