by Suryaa Desk | Mon, Jan 06, 2025, 02:59 PM
మెట్ పల్లి మండలం కొండ్రికర్ల గ్రామానికి చెందిన కురుమ యాదవ సంఘ భవనం నిర్మాణానికి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఎంపీ నిధుల నుండి నాలుగు లక్షల రూపాయలు మంజూరు అవ్వగా ఆదివారం భాజపా మండల అధ్యక్షులు కొమ్ముల రాజపాల్ రెడ్డి సంఘ సభ్యలకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కుల సంఘాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మండలంలోని ప్రతి గ్రామానికి కుల సంఘాల అభివృద్ధి కి నిధులు మంజురు అయ్యేల కృషి చేస్తామన్నారు. నిధులు మంజూరు చేసిన ఎంపీకి సంఘ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆకుల శ్రీనివాస్, గంట రాజేశ్వర్, ఇల్లేందుల శ్రీనివాస్, బద్దం గంగాధర్, సుకెందర్ గౌడ్, మారు జనార్దన్, ఏలేటి శ్రీను, సబ్బని అశోక్, రాకేష్ లు పాల్గొన్నారు.