by Suryaa Desk | Mon, Jan 06, 2025, 03:40 PM
మియాపూర్ లో దారుణం చోటుచేసుకున్నది. ఓ గుర్తు తెలియని వ్యక్తి(35)ని హంతకులు ఇటుక రాయితో తలపై మోది దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి హఫీజ్ పెట్ రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి(35)ని ఇటుక రాయితో తలపై మోది దారుణంగా హత్య చేశారు.
ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.మియాపూర్ పోలీసులు రైల్వే స్టేషన్ వద్ద ఉన్న సీసీ పుటేజి లను పరిశీలించి హంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.