by Suryaa Desk | Tue, Jan 07, 2025, 02:34 PM
బెజ్జుర్ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బెజ్జుర్ మండల విద్యాధికారి సునీతా చేతుల మీదుగా ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండరు ను ఆవిష్కరణ చేయడం జరిగింది.
అనంతరం జిల్లా అధ్యక్షులు తలండి లక్ష్మణ్ మాట్లాడుతూ జిఓ నంబర్ 3అమలు చేయాలనీ ప్రభుత్వం సమ్మె చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులన్యాయ మైన డిమాండ్లను పరిష్కరించి వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విద్యార్థుల భవిష్యత్తు నష్టం జరుగకుండా బాధ్యత ప్రభుత్వం పైన ఆధారపడిఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్స్ మండలం అధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి చింతపురి రాజారాం, ప్రధానోపాధ్యాయులు బిక్షమయ్య, రమేష్, రాములు, హన్మంతు, పరదేశి వెంట్రావు, పంచాయతీ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.