by Suryaa Desk | Wed, Jan 08, 2025, 03:44 PM
తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సారథ్యంలో వికారాబాద్ మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ అన్నారు. మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.70 లక్షల నిధులతో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం డంపింగ్ యార్డ్ లో మిషనరీ షెడ్ నిర్మాణం మరియు కంపోస్ట్ స్క్రీనింగ్ రిఫైన్మెంట్ స్టోరేజీ షెడ్ నిర్మాణ పనులను వికారాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ అర్థ సుధాకర్ రెడ్డితో కలిసి చైర్ పర్సన్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, కమిషనర్ జాకీర్ అహ్మద్, స్థానిక కౌన్సిలర్ సురేష్, కౌన్సిలర్ చందర్ నాయక్, నాయకులు మాలే లక్ష్మణ్, రెడ్యా నాయక్, దీపు, సర్పరాజ్, ఏఈ అనిల్ కుమార్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఏసుదాసు మున్సిపల్ సిబ్బంది తదిరులు పాల్గొన్నారు.