by Suryaa Desk | Wed, Jan 08, 2025, 03:47 PM
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిబా పూలే సంఘా భవనంలో జ్యోతిబా పూలే జాతీయ అవార్డు గ్రహీత గుర్లె శ్రీనివాస్ ను మాలి సంఘం నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. చింతలమానేపల్లి మండలం డబ్బా బారెగూడ గ్రామానికి చెందిన గుర్లె శ్రీనివాస్ శ్రీ శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపు పొంది, 2025 సంవత్సరానికి గాను ఈ నెల5న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ 7వ తెలంగాణ రాష్ట్ర కాన్ఫరెన్స్ లో జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ మరియు మేజిస్ట్రేట్ జస్టిస్ ఈశ్వరయ్యలు గుర్లె శ్రీనివాస్ ను శాలువాతో సన్మానించి, మహాత్మా జ్యోతిబా పూలే జాతీయ అవార్డును అందించారు.
ఈ సందర్భంగా మాలి సంఘం నాయకులు కౌటాల మహాత్మ జ్యోతిబా పూలే భవనంలో శ్రీ శివరామసాయి యూత్ వెల్ఫేర్ సొసైటి వ్యవస్థాపక అధ్యక్షుడు జాతీయ అవార్డు గ్రహీత గుర్లె శ్రీనివాస్ ను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. మారుమూల ప్రాంతాల్లో పుట్టి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న గుర్లె శ్రీనివాస్ ఇంకా మంచి సేవలను అందించాలని మాలి సంఘ నాయకులు ప్రోత్సహిస్తూ శ్రీనివాస్ ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా ఫూలే నేషనల్ అవార్డు గ్రహీత యూత్ అధ్యక్షుడు గుర్లె శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు ఇంత గొప్ప అవార్డు రావడానికి సహకరించిన యూత్ సభ్యులకు, అధికారులకు ముఖ్యంగా మాలి సంఘం నాయకులకు మాలి కులస్థులకు పేరుపేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాలి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అభ్యర్థి ఆదే వసంతరావు, మాలి సంఘ జిల్లా అధ్యక్ష అభ్యర్థి నికోడే గంగారం,మాలి సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి అభ్యర్థి ఆదే శ్రీనివాస్, మాజీ తాజా సర్పంచ్ వశక జ్యోతిరావు- నిహారిక , మాజీ తాజా సర్పంచ్ మోర్లే రమేష్, ఆదే బాపూరావు, మోర్లే రాము, నారాయణ, సెండే ముక్తేశ్వర్, మోర్లే పాండురంగ్, నీ కోడె సంతోష్, నాగోషే గణపతి,వేంకటి మరియు తదితరులు పాల్గొన్నారు.