by Suryaa Desk | Wed, Jan 08, 2025, 03:45 PM
తెలంగాణ మోడల్ స్కూల్‌లో 2025 - 26 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలతో పాటు 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు చేవెళ్ల మోడల్ స్కూల్ అండ్ కళాశాల ప్రిన్సిపాల్ చిన్నపురెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 6వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు, విద్యార్థులు ఫిబ్రవరి 28వ తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
విద్యార్థులు పరీక్ష ఫీజు కింద రూ.200 చెల్లించాలని, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ విద్యార్థులు రూ.125 చెల్లిస్తే సరిపోతుందన్నారు. 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 13న ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు, 7నుంచి 10వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారికి మధ్యాహ్నం 2గంటల నుంచి 4గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు telanganams. cgg. gov. inలో చూడాలని పేర్కొన్నారు.