by Suryaa Desk | Tue, Jan 07, 2025, 02:50 PM
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ రిక్లరేషన్ సందర్భంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ, ఎకరాకు 15వేల రూపాయల రైతు భరోసా హామీలను అమలు చేయాలని సోమవారం బెజ్జంకి మండల కేంద్రంలోని మండల వ్యవసాయాధికారికి వినతిపత్రం అందజేసి, నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిరసన కార్యక్రమం చేపట్టిన అనంతరం మండల వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేసి మీడియాతో మాట్లాడుతూ వరంగల్ డిక్లరేషన్ లో ఎన్నికలకు ముందు రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని, పదివేల రూపాయలు మాత్రమే రైతు భరోసా ఇస్తుందని, తాము అధికారంలోకి వస్తే పదిహేను వేలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి, ఇప్పుడు 12 వేల రూపాయలకు కుదిరించడం అన్యాయమని వారు విమర్శించారు, 2 లక్షల రూపాయల రుణమాఫీ సైతం సగం మంది రైతులకు కూడా కాలేదని వారి పేర్కొన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 12,000 మందికి ఒక కోటి 20 లక్షల రూపాయల రైతు రుణమాఫీని ఇవ్వడం జరిగిందని, తాము ఏలాంటి షరతులు విధించలేదని, ఇప్పుడు షరతులతో రైతు భరోసా ఇస్తామనడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదని, వారు స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో లబ్ధి కొరకే కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, నాయకులు లింగాల లక్ష్మణ్, చింతకింది శ్రీనివాస్ గుప్తా, కనగండ్ల తిరుపతి, సంజీవ రెడ్డి, మహేందర్ రెడ్డి, కచ్చు రాజయ్య, ముక్కిస తిరుపతిరెడ్డి, బండి రమేష్, ఎలుక దేవయ్య, దీటి బాలనర్సు,రాజు, వంగ నరేష్, బిగుళ్ళ మోహన్, దుర్గా సుదర్శన్, టి భూమయ్య, టేకు తిరుపతి, కల్లూరు రవి, తదితరులు పాల్గొన్నారు