by Suryaa Desk | Tue, Jan 07, 2025, 04:14 PM
ఓదెల పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో SBI బ్యాంకు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు విద్యార్థిని విద్యార్థులు .మండలం కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో వేల ఖాతాలు న్న సౌకర్యాలు లేవు. ఏటీఎం లేక బ్యాంకు వచ్చిన ఖాతాదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు బ్యాంకు ఖాతాదారుడు యువ రైతు ఎంబడి కుమార్ మాట్లాడుతూమేజర్ గ్రామపంచాయతీ అయినా ఓదెలలో ఎస్బిఐ బ్యాంకు మంజూరు చేసినట్లయితే ఓదెల నాంసానిపల్లి . లంబాడి తండా.
అమ్మిడిపల్లి కొమిర. గ్రామాల ఖాతాదారులకు సౌకర్యంగా ఉంటుందని అన్నారు.అలాగే విద్యార్థిని విద్యార్థుల స్కాలర్షిప్ ల కోసం పక్క గ్రామమైన పొత్కాపల్లి ఆంధ్ర బ్యాంకు కు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడినది. ఓదెల మండల కేంద్రంలో ఎస్బిఐ బ్యాంకు ఏర్పాటుకు ఉన్నత అధికారులు .ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని ఎస్బిఐ బ్యాంకు మంజూరుకు తోడ్పడగలరని ప్రజలు కోరుతున్నారు.