by Suryaa Desk | Mon, Jan 06, 2025, 03:59 PM
పీటీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆదివారం గజ్వేల్ యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిగుల్ గ్రామ మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ యువజన మాజీ అధ్యక్షులు తీగుల్ గ్రామ మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ రావు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిత్యం ప్రజల కోసం పనిచేసే నాయకులు టీపీసీసీ అధికార ప్రతినిధి బండారి శ్రీకాంత్ రావు అని అన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. రాష్ట్రంలో అన్ని సబ్బండ వర్గాలకు అతీతంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం పార్టీ బలోపేతం కోసం అందరిని కలుపుకొని పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాందాపూర్ మాజీ, సర్పంచ్ బిక్షపతి, బిజీ వెంకటాపూర్ మాజీ సర్పంచ్ రమేష్, మాజీ ఎం పి టి సి బరిగి నర్సింలు, మండల పార్టీ ఉపాధ్యక్షులు పిట్టల నర్సింలు, సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బునారి రాజు, జగదేవపూర్ మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అన్నపు దాసు, కొండపోచమ్మ డైరెక్టర్లు ఆశయ, చెక్కల నరేష్, వజ్రమ్మ రఘుపతి, సీనియర్ నాయకులు అబ్బు, అంజద్, కిష్టయ్య, వెంకట్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు వెంకటేష్, నాయకులు కొండయ్య, నర్సింలు, పూసల రవి, రతన్, నరేందర్, యువజన నాయకులు స్వామి, గౌస్, వెంకటేష్ , వెంకట్ రెడ్డి ,మహేష్, కిషన్, భాను, అనిల్, కార్తీక్ రెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.