by Suryaa Desk | Sun, Jan 05, 2025, 01:33 PM
ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ప్రజలు ఆహార పలవాట్లను మార్చుకొని సంపూర్ణ ఆరోగ్యవంతంగా జీవించాలని ప్రముఖ డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు. శనివారం ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో నీ పంచాయతీ కార్యాలయంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేసిన అనంతరం కూరపాటి హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు తో పాటు వ్యాధుల పట్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్రజల్లో ఆహార అలపాట్లపై వచ్చిన మార్పుతో అనారోగ్యాల పాలవుతూ బీపీ షుగర్, వ్యాధుల బారిన పడి అనారోగ్యాలకు గురవుతున్నారు. యువత నుండి మొదలుకొని వృద్ధుల వరకు ఎవరైనా జింకు ఫుడ్ కు అలవాటుకు పడి అనారోగ్యాల బారిన పడుతున్నారు అన్నారు. అలాగే ఫైల్స్, పీషర్, ఫిస్టులా వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడి ఆర్థికంగా చితికి పోతున్నారన్నారు. తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలన్నారు.
రోజుకు ఐదు లీటర్ల నీళ్లు తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ వైద్య నిపుణు లు డాక్టర్ కూరపాటి రాధిక ఎమ్మెస్ సర్జన్ మాట్లాడుతూ స్త్రీలు సంబంధించిన వ్యాధులైన అండాశయ కంతులు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమి సమస్యలకు పలు సూచనలు సలహాలను అందించారు. గర్భసంచి ఆపరేషన్ అండాశయ కంతులు లాప్రోస్కోపీ ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ నిర్వహిస్తామన్నారు. మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ప్రజలకు అందిస్తామని డాక్టర్ కూరపాటి రాధిక అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి ఎనకాతల విజయ అంశాలరెడ్డి, మాజీ ఎంపీటీసీ పోగుల ఇందిరా రాసిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంపూర్ణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు సంజీవరావు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బో ల్లబోయిన రవి యాదవ్, అనంతరెడ్డి, కూరపాటి వైద్య