by Suryaa Desk | Sat, Jan 04, 2025, 03:00 PM
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నవిద్యార్థుల్లో ఉన్న ఆంగ్ల భాష నైపుణ్యాలను వెలికి తీసేందుకై (ఎల్టా) ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ధర్మారం శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి ఇంగ్లీష్ ఒలంపియాడ్, మరియు ఉపన్యాస పోటీలను నిర్వహించినట్లు కే.శ్రీధర్ రెడ్డి,మాలతి లత తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు జనవరి 18న జరగనున్న జిల్లా స్థాయి పోటీలకు పాల్గొననున్నారు. ఒలంపియాడ్ పోటీలలో జడ్.పి.హెచ్.ఎస్ నంది మేడారం పాఠశాలకు చెందిన ఈ. జోషిత ప్రథమ స్థానంలో నిలువగా జడ్.పి.హెచ్.ఎస్ కొత్తూరు పాఠశాలలో చదువుతున్న ఏ. అలేఖ్య ద్వితీయ స్థానంలో నిలిచింది నంది మేడారం జడ్.పి.హెచ్ ఎస్ కు చెందిన పి. జశ్విత తృతీయ స్థానంలో నడిచింది.
ఉపన్యాస పోటీలలో ధర్మారం పాఠశాలకు చెందిన ఆర్. సన ప్రథమ స్థానంలో నిలువగా నంది మేడారం పాఠశాలకు చెందిన ఈ. జోషిత ద్వితీయ స్థానంలో నిడిచింది ఎల్. అంజలి తృతీయ స్థానం సాధించింది. నంది మేడారం జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన ఇంగ్లీష్ ఒలంపియాడ్ లో ప్రథమ స్థానం మరియు ఉపన్యాస పోటీలలో ద్వితీయ స్థానం సాధించి రెండు విభాగాల్లో జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధించిందని తెలిపారు. విజేతలను ఎల్టా మండల కన్వీనర్లు కే. శ్రీధర్ రెడ్డి, మాలతిలత ప్రశంస పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయులు బి. రాజకుమార్, అరుణ, శ్రీనివాస్ చారి,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.