by Suryaa Desk | Sat, Jan 04, 2025, 02:26 PM
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు క్రమశిక్షణ నైతిక విలువలతో కూడిన విద్యాబోధన అందించాలని జిల్లా సెక్టోరియల్ అధికారి రామస్వామి, మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలం కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో సావిత్రిబాయి పూలే 194 జయంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఫుడ్ ఫెస్టివల్ (పౌష్టికాహార పండగ) నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం మనం తినే ఆహార పదార్థాలలోనే మన ఆరోగ్యం దాగి ఉంది. ఈ విషయాన్ని పిల్లలందరికీ తెలియజేయడానికి వివిధ రకాలైనటువంటి మూడువందలకు పైగా వంటకాలను పిల్లలచే వారి తల్లిదండ్రుల సహాయంతో తయారు చేయించి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, జంక్ ఫుడ్ లకు సంబంధించిన పౌష్టికాహారలు పండుగలో ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
గత నాలుగు సంవత్సరాల నుంచి పాఠశాల అభివృద్ధికి సహాయపడిన ఆస్ట్రేలియా ఎన్నారై దంపతులు వుడెం విజయలక్ష్మి- మైపాల్ రెడ్డి, సింగపూర్ ఎన్నారై దంపతులు జంగం సారిక - ప్రవీణ్ గౌడ్,నరేందర్ రెడ్డి పాఠశాలకు విచ్చేసి 1000 నోటుబుక్స్,పలకలు,పరీక్ష ప్యాడ్లు,రెండు గ్రీన్ బోర్డ్స్, కంప్యూటర్ సిపియు, ఎంఈఓ కార్యాలయానికి డిజిటల్ గడియారం, తల్లిదండ్రులు లేని కస్తూరి చరణ్,కస్తూరి రిత్విక లకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. వీరితోపాటు గ్రామ యువకులు కూడా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. సావిత్రిబాయి పూలే లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి సహకరించిన ఎన్నారై దంపతులకు ఇతర దాతలకు పాఠశాల తరఫున ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అంజిరెడ్డి, నాగరాజు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ రాధ, పిఆర్టియు మండల అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, ప్రధానోపాధ్యాయులు సుధాకర్ రాజగోపాల్ రెడ్డి నిర్మల మేరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు ఉపాధ్యాయులు వంశీకృష్ణ, మల్లికార్జున్ స్రవంతి మంజుల శృతి, పంచాయతీ కార్యదర్శి పరమేశ్వర్, గ్రామస్తులు ఆంజనేయులు, మల్లేశం,రాజు, తదితరులు పాల్గొన్నారు.