by Suryaa Desk | Fri, Jan 03, 2025, 04:10 PM
గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.గురువారం కోహెడ మండల కేంద్రం లక్ష్మి గార్డెన్స్ లో మండల స్థాయి ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గ్రామగ్రామాన ప్రజల్లోకి తీసుకెళ్లాలి.గతంలో బిఅరెస్ ఏం చేసిందని ప్రశ్నించండి..కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది..ఇచ్చిన మాట ప్రకారం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేశాం..సంక్రాంతి కి రైతు భరోసా వస్తుంది ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్ అమలు చేస్తున్న గ్రామాల్లో 90 శాతం ప్రజలకు లబ్ధి జరుగుతుంది. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు వస్తాయి ఇందిరమ్మ ఇళ్ల సర్వే జరుగుతుంది ఇళ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తం ఇళ్ల కేటాయింపులో చాలా పారదర్శకంగా ఉంటుందని ఇందులో ఎవరి జోక్యం ఉండదు అని అన్నారు. సింహారాయ జాతర లోపు రోడ్లు మరమత్తులు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఏడాది కాలంలోనే ఇన్ని కార్యక్రమాలు చేశాం చేసిన పనులన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయాలని అన్నారు.హుస్నాబాద్ నియోజకవర్గం అంటే గౌరవం పెరిగింది సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇప్పటికే 55 వేల ఉద్యోగాల భర్తీ చేశాం సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చాం కొహెడ మండల నుండి 20,172 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించాం అందరికీ ధాన్యం డబ్బులు చెల్లించాం.కోహెడ కి కృషి విజ్ఞాన కేంద్రం మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో టేలిపోన్ లో ప్రసంగం చెపించిన మంత్రి పొన్నం ప్రభాకర్ఇప్పటికే 30 వేల కోట్ల వ్యవసాయం రైతు సంక్షేమం కోసం కేటాయించమన్న మంత్రి తుమ్మల ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ లో రైతు భరోసా పై నిర్ణయం తీసుకుంటామని అన్నారు.అందరూ ఆదాయం వచ్చే పంటలు వేయాలని సూచించిన తుమ్మల హుస్నాబాద్ , కోహెడ , సైదాపూర్ మార్కెట్ కమిటీ ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తా ఆని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇట్టి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మంద ధర్మయ్య, కర్ణకంటి మంజులారెడ్డి, ఏఎంసి చైర్ పర్సన్ బోయిని నిర్మల జయరాజ్, సీనియర్ నాయకులు బసవరాజ్ శంకర్, శెట్టి సుధాకర్, భీమిరెడ్డి మల్లారెడ్డి,వై చైర్మన్ భీమిరెడ్డి తిరుపతిరెడ్డి, అన్నాడి జీవన్ రెడ్డి, భీనమేని రాకేష్, కాంతాల శివారెడ్డి, చిలుపోరి సనత్ రెడ్డి, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.