by Suryaa Desk | Fri, Jan 03, 2025, 03:07 PM
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల ప్రజలకు తహసీల్దార్ ఆఫీస్ నందు “ఆధార్ సేవా శిబిరం”నిర్వహించబడుతోంది. 2010 నుండి 2016 మధ్యలో ఆధార్ చేసుకున్న వారందరూ ఓటర్ ఐడి కార్డ్ గాని లేదా బ్యాంక్ అకౌంట్ గాని లేక పోతే ఇంటి పన్ను గాని లేదా రేషన్ కార్డు గాని లేదా గ్యాస్ బిల్లు లేదా లేబర్ కార్డు గాని లేదా ఫిషర్మెన్ కార్డు గాని ఏదైనా ధ్రువపత్రాలు సమర్పించుకుని “డాక్యుమెన్ట్ అప్‌డేట్”చేసుకోవలెను.దీనికి గాను 50 రూపాయలు రుసుము చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డులో “పేర్లు మరియు అడ్రస్ మార్పులకు “గాను 50 రూపాయలు రుసుము చెల్లించవలసి ఉంటుంది.
@బయోమెట్రిక్ అప్డేట్లు”చేసుకోవడానికి గాను 100 రూపాయలు రుసుము చెల్లించవలసి ఉంటుంది. కొత్తగా ఆధార్ చేయించుకునే చిన్నపిల్లలకు ఉచితంగా ఆధార్ చేయబడును. 08-01-2025 నుంచి 17-01-2025 సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఆధార్ సెంటర్ సర్వీస్‌లు చేయబడును కావూన నల్లబెల్లి ప్రజలందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోనగలరన తహశీల్దార్ ముప్పు కృష్ణ కోరారు.