by Suryaa Desk | Fri, Jan 03, 2025, 04:15 PM
పోలీస్ శాఖలో హోంగార్డ్ గా గత 36 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న డి. అంతయ్య ను ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ పూలమాల వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు.పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారు అని శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా పోలీస్ విభాగంలో సుధీర్ఘకాంగా విధులు నిర్వహించి పదవీవిరమణ చేసిన సేవను మరువమని, పదవీవిరమణ చేసిన మీరు ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించ వచ్చని అన్నారు. కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు గారు, ఆర్.ఐ లు రామక్రిష్ణ, కిరణ్ కుమార్, వేణు పాల్గొన్నారు..