by Suryaa Desk | Sat, Jan 04, 2025, 04:40 PM
జగిత్యాల జిల్లా బుగ్గార మండలం కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఎంపీడీవో ఎమ్మార్వో నూతన భవనాల కొరకై శంకుస్థాపన చేసినటువంటి ప్రభుత్వ నూతన భవనాల పనులు నేడు పునర్నిర్మాణ పనులు కాంట్రాక్టు ఐలెన్ యాదవులు చేపట్టడం జరిగింది. ఈ నూతన భవనాలు బుగ్గార మండలం ప్రజల కోరిక మేరకు ఎమ్మెల్యే స్పందించి ఇట్టి భవనాలను సాంక్షన్ చేపించిన సందర్భంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు ప్రజలు ధన్యవాదాలు తెలపడం జరిగింది.
బుగ్గార మండలం పరిసర గ్రామాల ప్రజల ఆలోచన విధానాన్ని గ్రహించిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేముల సుభాష్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ఈరోజు పునర్నిర్మాణం పనులు చేపట్టిన సందర్భంలో సుభాష్ కు కూడా ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు ఉపాధ్యక్షులు నరస గౌడ్, బిల్డింగ్ కాంట్రాక్టు ఐలెన్ యాదవ్, ఏ ఈ మహేందర్ కాంట్రాక్టు బృందం తదితరులు పాల్గొన్నారు.