by Suryaa Desk | Sat, Jan 04, 2025, 04:15 PM
మెట్ పల్లి మండలం వెంపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సావిత్రి బాయ్ పూలె జయంతి పురస్కరించుకొని మహిళ ఉపాధ్యాయ దినోత్సవం ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమము లొ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళ అక్షరత కోసం తపించిన ఉక్కు మనిషి అన్ని సావిత్రి బాయ్ పూలేను కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి పుల్లె పుట్టినరోజు న మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అధికారికంగా జరుపడం చాలా శుభ దినం గా వర్ణించారు అనంతరం ప్రధానోపాధ్యాయులు శ్రీమతి వి నాగరాజ కుమారి,మరియు మహిళా ఉద్యోగులు సుధ ,సుజాత లను సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గోరుమంతుల ప్రవీణ్ కుమార్,శేఖర్ గౌడ్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు అల్లూరి సురేందర్ రెడ్డి,ఎల్లల బాపు రెడ్డి,గ్రామ ప్రముఖులు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.