by Suryaa Desk | Sun, Jan 05, 2025, 01:26 PM
డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి అరులైన వారికి లాటరీ ద్వారా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తిప్పర్తి మాజీ జెడ్పిటిసి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం తిప్పర్తి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను సిపిఎం బృందం పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అర్హులైన వారికి నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామన్న హామీ అమలులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తిస్థాయిలో నిర్మించడంలో విఫలమయ్యారని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే నిర్మాణాన్ని పూర్తిచేసి అర్హులైన వారికి లాటరీ ద్వారా ఎంపిక చేసి వారికి ఇవ్వాలని 90 శాతం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే కంప్లీట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వెంటనే అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి ఇండ్లు ఇవ్వాలని అన్నారు ప్రభుత్వాలు ఇండ్లు ఇస్తాయని నిరుపేద కుటుంబాలు పది సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నారు అని అన్నారు.
వెంటనే అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు ఇంటి స్థలం లేని వారికి స్థలాన్ని కేటాయించాలని కోరారు వెంటనే పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అరులైన వారికి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం తిప్పర్తి మండల కార్యదర్శి మన్నెం బిక్షం నాయకులు భీమగాని గణేష్ గండమళ్ళ రాములు చెనగోని వెంకన్న అకటి లింగయ్య జంజీరాల సైదులు జంజీరాల ఉమా మంత్రాల మంగమ్మ మాలి భార్గవి కోట్ల గోవర్ధన్ రెడ్డి శరత్ నలపారాజు యాదయ్య పోకల ఝాన్సీ సైదిరెడ్డి భీమగాని విజయలక్ష్మి రొట్టెలు జానయ్య రాములు రమేష్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.