by Suryaa Desk | Sat, Jan 04, 2025, 03:13 PM
అణగారిన వర్గాల, స్త్రీల విద్యా కొరకు బ్రాహ్మణ ఆధిపత్యం పైన పోరాడి పాఠశాలలు స్థాపించిన దీరా వనిత సావిత్రి బాయి పూలె ఆశయాలు సాదించాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి పిలునిచ్చారు. ఈరోజు ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్గొండ దొడ్డికొమురయ్య భావనంలో సావిత్రిబాయి పూలె 194 వ జయంతి ఘణంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపలని ప్రకటించడం హర్షించదగ్గ విషయమని ఐద్వా తరుపున ప్రభుత్వంనికి ధన్యవాదములు తెలిపారు. తరతరాల చీకటిని తరిమి వెలుతురై ఉదయించిన అఖండ అక్షర జ్యోతి, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అన్నారు
మహిళ హక్కులే మానవహక్కులని నినదించి సనాతన, ఛాందస, మత, సాంఘీక మూఢ దూరచారాల నిర్ములనకై ఉద్యమించిన సామాజిక వైతాళికురాలు సావిత్రిబాయిపులే అని కొనియాడారు. సామాజిక మార్పుకి, చైతన్యానికి, లింగ సమానత్వానికి విద్యనే ఆయుధమని భావించి మహిళా వెనుకబాటుకు విద్యలేకపోవడమే కారణమని గ్రహించి, విద్యావ్యాప్తికి అజన్మాంతం కృషి చేసిన గొప్ప మహనీయురాలు అన్నారు. ఎన్ని అవంతరాలు ఎదురయినా వెనుకడుగు వేయలేదున్నారు.సత్యశోదక్ సమాజ్ లో చేరి మహిళా లపైన జరుగుతున్నా వివక్ష అంటరానితనం సతీషహాగమనఁ కు వ్యతిరేకంగా పోరాడిన దిరావనితా సావిత్రి బాయి పూలె అన్నారు.
భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా, రచయితగా, సంఘసంస్కర్తగా సమాజ అభ్యున్నతి కోసం సమసమాజ స్థాపన కోసం ఆమె చేసిన పోరాటం చారిత్రాత్మకమని భవితరాలు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సావిత్రిభాయి పూలే గారి ఆశయ స్వప్నాల్ని నెరవేరుస్తాంమని భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రాథమిక హక్కుగా పొందుపరిచిన విద్యను అందరికి అందేలా కృషి చేస్తాంమని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండా అనురాదా, జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణ కుమారి, జిల్లా కమిటీ సభ్యులు జంజిరాల ఉమా, ట్రస్ట్ కన్వీనర్ మేకల వరుణ,నాయకురాలు పుప్పాల పుష్ప,శైలజ, లక్ష్మి, భాగ్యమ్మ, మరియమ్మ, రాణి కమల తదితరులు పాల్గొన్నారు.