by Suryaa Desk | Sun, Jan 05, 2025, 01:07 PM
కాకతీయ కాలువ నుండి పెద్దాపూర్ చెరువును నింపడం ద్వారా హుస్సేన్ మియా వాగు పరివాహక ప్రాంత పంట పొలాలకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు. శనివారం ఉదయం జూలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలోని చెరువును ఆయన పరిశీలించారు. కాకతీయ కాలువ రేవెల్లె క్రాస్ రెగ్యులేటరీ (సిఆర్) నుండి డి, 83 కెనాల్ ద్వారా పెద్దాపూర్ చెరువును నింపి, చెరువు ముత్తడి ద్వారా నీటిని హుసేనిమియా వాగులోకి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు.
తద్వారా హుసేనిమియా వాగు పరివాహక ప్రాంతంలోని రైతులకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. ఈ మేరకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఎస్ ఈ, ఈఈ తదితర అధికారులను ఎమ్మెల్యే ఫోన్ ద్వారా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దూలికట్ట పిఏఎస్సి చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్ రావు, జూలపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గండు సంజీవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొజ్జ శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొమ్ము పోచలు, సిరికొండ కొమురయ్య, బండి స్వామి, జక్కని శంకరయ్య,పెసర స్వామి, చెరుకు కనకయ్య,తదితరులు పాల్గొన్నారు..