by Suryaa Desk | Sat, Jan 04, 2025, 02:57 PM
వన మహోత్సవ కార్యక్రమంతో మెట్ పల్లి పట్టణమంతా పచ్చగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ మోహన్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని రేగుంట గ్రామ శివారులో 3.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహిస్తున్న వన నర్సరీని మున్సిపల్ కమిషనర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంగా ఉంచాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా మెట్ పల్లి పట్టణాన్ని పచ్చదనంగా మార్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అన్నారు. ప్రజలంతా వన మహోత్సవంలో పాల్గొని తమకు సహకరించాలని కోరారు. పట్టణ ప్రజలు తమ ఇంటి ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో పూల మొక్కలను, పండ్ల మొక్కలను నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఈ నాగేశ్వరరావు, సానిటరీ ఇన్స్ పెక్టర్ రత్నాకర్, ఇన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నిజాం, అశోక్, నరేష్, అనిల్, హరితహారం సిబ్బంది పాల్గొన్నారు.