by Suryaa Desk | Mon, Jan 06, 2025, 01:55 PM
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎస్ఐ శివకుమార్ అన్నారు. మండలంలోని మాగి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డు భద్రత ఉత్సవాల్లో భాగంగా ఆదివారం వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు మద్యపానం సేవించి వాహనాలు నడపొద్దని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్లో మాట్లాడకూడదని సూచించారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేయాలని కోరారు. సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత హామీలకు గురికావొద్దని తెలిపారు. సైబర్ క్రైం నేరానికి గురైతే వెంటనే 1930కి డయల్ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది శ్రీశైలం, శ్యామ్, లక్ష్మణ్ వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.