by Suryaa Desk | Tue, Jan 07, 2025, 04:22 PM
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో నీ అర్హులైన వారికి స్ట్రీట్ వెండర్స్ లోన్స్ సహాయంతో వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందాలని మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ అన్నారు. సోమవారం చైర్ పర్సన్ అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ హాల్లో స్వానిధి సమృద్ధి క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 8 రకాల స్కీములకు అర్హులైన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఉన్న స్ట్రీట్ వెండర్స్ వారి కుటుంబాల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది అన్నారు.
వీటిలో స్ట్రీట్ వెండర్స్ కు వారి కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ లు, జన్ దన్ బ్యాంకు ఖాతాలు, ఈ శ్రమ్ కార్డులు ఇప్పించడం తదితర అంశాలు ఉన్నాయని చైర్ పర్సన్ గారు వెల్లడించారు. కావున వికారాబాద్ పట్టణంలోని వీధి విక్రయ దారులు ప్రతి ఒక్కరు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జాకీర్ అహ్మద్, పట్టణ పతాక సమన్వయ అధికారి వెంకటేష్, ఐసిడిఎస్ సూపర్వైజర్ శాలిని, ఎస్ బి ఐ ఫీల్డ్ ఆఫీసర్ జయవర్ధన్, అధికారులు, స్ట్రీట్ వెండర్స్ తదితరులు పాల్గొన్నారు.