by Suryaa Desk | Tue, Jan 07, 2025, 05:14 PM
ప్రజావాణి దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించి, పెండింగ్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదే శించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ డి.వేణుతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల నుంచి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు సంబంధించి 26 దరఖాస్తులు ఇతర శాఖలకు సంబంధించి 16 దరఖాస్తులు వచ్చాయని, వీటిని సంబంధిత అధికారులకు కేటాయిస్తూ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని ఆదేశించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.రామగిరి మండలం, కల్వచర్ల గ్రామానికి చెందిన రాపెల్లి సాయి రెడ్డి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 89 లో 2 ఎకరాల 18 గుంటల వ్యవసాయ భూమి ఉందని, ఇది ధరణి లో నమోదు కావడం లేదని, మొఖ మీద ఎవరు ఉన్నారు విచారించి తగిన న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
పెద్దబొంకూర్ గ్రామంలో ఊరు చెరువు నుంచి సాగు నీరు వెళ్ళేందుకు రైల్వే లైన్ కింది నుంచి పైప్ ఉందని, ప్రస్తుతం రైల్వే వాళ్లు ఆ పైప్ మూసి వేస్తున్నారని, తమ గ్రామానికి సాగునీటి సమస్య ఉందని దీని పరిష్కరించాలని కోరుతూ పెద్దబొంకూర్ గ్రామ రైతులు దరఖాస్తు చేసుకోగా ఈఈ నీటిపారుదల శాఖ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పెద్దపల్లి పట్టణం బండారి కుంటకు చెందిన చంద్రగిరి సోని తను పుట్టుకతో మూగ చెవిటి దానినని, ఇంటర్ వరకు చదువుకున్నానని, తమ కుటుంబం పేదరికంలో ఉన్నందున వికలాంగుల కోటాలో ఏదైనా శాఖలో ఉద్యోగం ఇప్పించి జీవనోపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా భారతదేశ సైటుకు రాస్తూ అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.