by Suryaa Desk | Tue, Jan 07, 2025, 02:55 PM
ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నెక్కొండ మండలంలో రైతు నిరసన మహాధర్నా నిర్వహించడం జరిగింది ధర్నాను ఉద్దేశించి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పండగల ఉండే వ్యవసాయాన్ని కష్టంలోకి నెడుతూ రైతులకు ఆశ చూపుతూ ఆర్థికంగా దెబ్బతీయడానికి కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.
మే 6 2022 సంవత్సరం నాడు రైతు డిక్లరేషన్ పేరుమీద ఈనాటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆనాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వరంగల్లోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో రైతు డిక్లరేషన్ పెట్టి రైతులకు ప్రతి ఎకరాకు రెండు పంటలకు గాను 15 వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి నేడు సంవత్సరానికి 12,000 రూపాయలు మాత్రమే ఇస్తానని రైతులను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈ మోసాన్ని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ నేడు రైతు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఉపాధి హామీ గైడ్లైన్స్ ద్వారా ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న ప్రతి రైతుకు జాబ్ కార్డును ఇష్యూ చేసింది కేంద్ర ప్రభుత్వం. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్క రైతుకు 12 వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి అదే విధంగా ఎలక్షన్స్ ముందు ఒప్పుకున్న ప్రకారం రైతు భరోసా 15 వేల రూపాయలు రెండు పంటలగాను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము.
ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఇవ్వకపోతే ప్రజాప్రతినిధులందరూ హైదరాబాద్ కె పరిమితం కావలసి వస్తుంది అని వారు మాట్లాడారు ఈ ధర్నా కార్యక్రమంలో నెక్కొండ మండల పార్టీ అధ్యక్షులు,మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పిటిసిలు,మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు, రైతులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.