by Suryaa Desk | Sun, Jan 05, 2025, 02:55 PM
దేవరకొండపట్టణ పరిధిలోని ఎంపిడిఓ కార్యాలయ ప్రాంగణంలో ఇందిరమ్మ ఇండ్ల నమూనా పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బాలు నాయక్ హాజరై,ఇందిరమ్మ ఇండ్ల నమూనా పనులను శంకుస్థాపన చేశారు .ఆయన మాట్లాడుతూఇందిరమ్మ ఇళ్ల పథకంలో బాగంగా తెలంగాణ వ్యాప్తంగా సొంత స్థలం ఉన్న వారి ఇంటి నిర్మాణానికి ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు రూ.5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు అని అన్నారు. గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందిన తరవాతే లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు.లబ్ధిదారుల జాబితాను ముందుగా గ్రామసభలో ప్రదర్శించాక సమీక్షించి ఆ తర్వాత ఫైనల్ చేస్తారు అని అన్నారు. 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టాలి.కిచెన్, బాత్రూం ప్రత్యేకంగా ఉండాలి. ఆర్ సీసీ రూఫ్‌తో ఇంటిని నిర్మించాల్సి ఉంటుందిఅన్నారు.లబ్ధిదారుల ఎంపిక అనంతరం జాబితాను గ్రామ, వార్డుసభలో ప్రదర్శిస్తారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా,మాజి మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్,పట్టణ మాజీ సర్పంచ్ పున్న వేంకటేశ్వర్లు,మాజి జడ్పీటీసీ మారుపాకల అరుణ సురేష్ గౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర రాంసింగ్ నాయక్,యువజన కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ,డిఈ రామ నర్సింహా రెడ్డి, నాగేష్, ఎంపిడిఓ డానియల్,మాజి సర్పంచ్ శివయ్య,నారాయణ నాయక్,యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర బాలు,యువ నాయకులు బాబు రామ్ నాయక్, సుభాష్ నాయక్, ఎంపిడిఓ సిబ్బంది లచ్చిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.