by Suryaa Desk | Sun, Jan 05, 2025, 02:37 PM
జగదేవపూర్ మండల కేంద్రంలో గల అక్షర పాఠశాలలో శనివారం నాడు వచ్చే 2025 - 26 విద్యా సంవత్సరం కు గాను నూతన ఆదర్శ తరగతి గదిని మండల ఎమ్. ఈ .ఓ మాధవరెడ్డి మరియు కాంప్లెక్స్ హెచ్. ఎమ్ సైదులు తో కలసి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అధునాతన విద్య విధానాన్ని కొనసాగించడం గొప్ప విషయమని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాలలు కూడా మరాల్సిన అవసరం ఉంది అన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు అనుగుణంగా విద్యా వ్యవస్థ మారుతుంది కాబట్టి ప్రతి ఒక్క పాఠశాల మరాల్సిన అవసరం ఉంది అని తెలిపారు. జగదేవపూర్ లో ఈ ప్రొపెల్ అత్యాధునిక సిస్టం అక్షర పాఠశాల వాళ్ళు తీసుకోవడం సంతోషం అని యాజమాన్యాన్ని అభినందించారు. విద్యార్థులు డిజిటల్ విధానంలో విద్యా నేర్చుకోవాలి అనేది రానున్న రోజుల్లో తప్పనిసరి అన్నారు. కరెస్పాన్డెంట్ రామస్వామి మాట్లాడుతూ అక్షర పాఠశాల యాజమాన్యం విద్యార్థుల విద్యా అభివృద్ధి కోసం కట్టుబడి ఉంది అన్నారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని అధునాతన సాంకేతిక విద్యావిధానం వైపు అడుగులు వేయాలని అన్నారు.
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు మొగుతాయి కాబట్టి అలాగే విద్యార్థుల బావిషత్తు కోసం తల్లిదండ్రులు కూడా పాఠశాల యాజమాన్యం తో కలిస్తేనే మనం విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించడానికి అవకాశం ఉంది అని తెలిపారు. ప్రతి తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తు కు తోడ్పాటు అందించాలి అన్నారు. మారుతున్న పోటీ ప్రపంచంలో భాగంగా మనం కూడా మారాలని తెలిపారు. పట్టణాల్లో అందించే విద్య అక్షర పాఠశాల లో అందించడానికి జయమాన్యం సిద్ధమైంది అని తెలిపారు. అక్షర పాఠశాల యాజమాన్యం ఎప్పటికప్పుడు ఉపాధ్యాయుల కు శిక్షణ నైపుణ్యాన్ని నేర్పించి ముందుకు సాగుతుంది అన్నారు.పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు జయమాన్యం తో కలిస్తేనే విద్యార్థుల కు మంచి విద్యా అందుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాన్డెంట్ రామస్వామి , ప్రిన్సిపాల్ సంతోషిజ్యోతి రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ సుదర్శన్, ఇంచార్జి రేణుక , ప్రొపెల్ సిద్దిపేట జిల్లా ఇంచార్జి ఉదయ్ ప్రభాకర్, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.