by Suryaa Desk | Tue, Jan 07, 2025, 02:46 PM
బెజ్జంకి మండల కేంద్రంలో విశాలమైన క్రికెట్ గ్రౌండ్లో ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంట్ ను బెజంకి ఎస్సై జే కృష్ణారెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఇంత అధునాతనంగా గ్రౌండ్ ను తయారు చేసి క్రికెట్ టోర్ని ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులను అభినందించారు. పలు జిల్లాల నుండి క్రీడాకారులు ఈ టోర్ని లో పాల్గొనడం తనకు సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు.
నేటి యువత చెడు వ్యసనాల పట్ల ఆకర్షితులు కాకుండా ఇలాంటి టోర్నమెంట్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ రఘువీర్, మానాల రవి, డివి రావు, సంగెం మధు, దొంతర వేణి ప్రవీణ్, లింగాల లక్ష్మణ్, దండ్ల విజయ్, తిప్పార మహేష్, ధూమల సురేష్ తదితరులు ఉన్నారు.